ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోగ్యం బాగాలేనప్పుడు తమ నియోజక వర్గాల్లో హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకున్న సందబాలు లేవు. కనీసం జిల్లా ఆసుపతుల్లో కూడా చేయించుకోరు .అటు చెన్నై, హైదరాబాద్, లేదా ముంబై పోతారు. అదీ కాదంటే అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకొని వస్తారు. కానీ ఒకప్పటి హైదరాబాద్ సంస్థానం చివరి నవాబు ఉన్మాన్ ఆలీఖాన్ ఈ విషయంలో అందరికీ ఆదర్శప్రాయుడే. తన జీవిత చరమాంకంలో ఆయనకు ఆరోగ్యం క్షీణించింది.

అప్పట్లో భారత ప్రభుత్వం ఆయనను వైద్య చికిత్సలకు లండన్ పంపిస్తామని కబురు పెట్టింది. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. నేను కట్టిచ్చిన ఉస్మానియా హాస్పిటల్ ఉండగా , నేను లండన్ కి పోయి వైద్యం చేయించుకుంటే అవమానం కాదా అని తిరస్కరించారట. చివరి శ్వాస స్వదేశంలోనే , పుట్టిన గడ్డ మీదనే జరగాలి. నన్ను ఇక్కడే ఖననం చెయ్యాలి.. అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ తిరస్కరించారు.

