కొన్ని అద్భుతాలకు సమాధానాలు ఉండవు . ఎందుకంటే అవి అద్భుతాలే . వైద్యశాస్త్రానికి కూడా అందని చిక్కు ప్రశ్నలు . అమెరికాలో మిచిగాన్ రాష్ట్రంలో నైల్స్ వద్ద ఓ కారు ప్రమాదంలో జెన్నిఫర్ అనే యువతీ గాయపడింది. ఆమెను హాస్పిటల్లో చేర్పించే సమయానికి కోమాలోకి జారుకుంది . డాక్టర్లు ఇక ఆమె కోమాలోనుంచి బయటపడే అవకాశంలేదని పంపించి వేశారు . ఇంట్లో ఐదేళ్లపాటు జెన్నిఫర్ కోమాలోని ఉండిపోయింది. తల్లి ప్రేమ అనంతమయింది కదా.? అందుకే డాక్టర్లు ఆమె కోమాలోనుంచి బయటకు రాదని చెప్పినప్పటికీ తల్లి మాత్రం ఆశలు వదులుకోలేదు . ప్రతిరోజు కోమాలో ఉన్న జెన్నిఫర్తో మాట్లాడేందుకు ప్రయత్నం చేసేది. కొన్ని ముఖ్య విషయాలను చెబుతూ ఉండేది . అయితే తల్లి చెప్పేది ఏది కూడా జెన్నిఫర్ వినిపించుకునేది కాదు. ఆమె శూన్యంలోకి చూస్తున్నట్టు ఉండిపోయేది. ప్రాణమున్న శవం లాగానే ఉండేది.
ప్రపంచంతో సంబంధం లేని లోకంలో తల్లి మాత్రం ఆమె చెవిలో ఏదోఒకటి చెబుతూ ఉండేది. చెప్పేది ఏది కూడా ఆమెకు వినపడదు. ఆకలి అని చెప్పలేదు. మాట్లాడలేదు. శూన్యంలోకి చూస్తున్నట్టు అలాగే ఉండిపోయేది . దాదాపుగా బ్రతికున్న శవం లాగే బ్రతుకుతుండేది. ఓ రోజు అద్భుతం జరిగింది . జెన్నిఫర్ తల్లి కోమాలో ఉన్న కూతురితో ఎప్పటిలాగానే ఒక జోక్ చెప్పింది. అంతే ఆశ్చర్యంగా అద్భుతమైన ఘటన జరిగింది. కోమాలో ఉన్న కూతురు జెన్నిఫర్ , తల్లి వేసిన జోక్ తో పకపక నవ్వింది . కోమాలో ఉన్న కూతురికి తన మాట వినబడిందని ,అర్థమైందని , నవ్వుతుందని తల్లి యెగిరి గంతేసింది.
ఐదేళ్ల తర్వాత ఒక విచిత్రం . ఇదొక అద్భుతం. వైద్యశాస్త్రానికి అందని ఒక సంచలనం. వెంటనే జెనిఫర్ తల్లి ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్ళింది . ఆమె కోమా నుంచి బయటకు వచ్చేసిందని డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే ఐదేళ్లుగా మాట్లాడలేకపోవడంతో స్పీచ్ థెరపీ అవసరమని చెప్పారు . కొద్దికాలంలోనే మాటలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు జెన్నిఫర్ నవ్వుతూ తన కొడుకుతో ఆడుకుంటుంది. ఆమె కోమాలోకి పోయే సమయానికి ఏడాది వయసులో ఉన్న కొడుకు ఇప్పుడు ఆరేళ్ల వయసులో తల్లిని చూసి మురిసిపోతున్నాడు .

