సెలెబ్రిటీలు బెట్టింగ్ రాయుళ్ల సరసన చేరారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కింద హీరో విజయ్ దేవరకొండతోసహా అందరిపై కేసులు నమోదు చేసారు. నిందితుల జాబితాలో వైసిపి అధికార ప్రతినిధి , ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి యాంకర్ శ్యామల కూడా ఉంది. బెట్టింగ్ వల్ల పదుల సంఖ్యలో యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో వివాదం రాజుకుంది. ఇప్పుడు మొత్తం 29 మంది సెలెబ్రిటీలపై పోలీసులు కేసులు బుక్ చేసారు.
వీరిలో మంచు లక్ష్మి, దగ్గుబాటి రానా , అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ , శ్రీముఖి , నిధిఅగర్వాల్ ఉన్నారు. వీరందరిపై ఇప్పుడు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణ జరుపనుంది. సినిమా సెలెబ్రిటీలు కాక టివి యాంకర్లు , నటులు కూడా ఈ రక్తపు కూటికి ఆశపడి ప్రమోషన్లు చేసిన వారే. వారిలో భయ్యా సన్నీయాదవ్, శోభాశెట్టి., రీతూచౌదరి, సిరి హనుమంతు, నేహాపఠాన్, నయనిపావని, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, విష్ణుప్రియ, హర్షసాయి, బండారు సుప్రీత , అమృతాచౌదరి, పండు, పద్మావతి, తదితరులు ఉన్నారు.
నిషేదిత యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ వీరంతా డబ్బులకు కక్కుర్తి పది ప్రమోషన్ చేసినట్టు నిరాదరణ అయింది. వీరందరి మీద బీఎన్ఎస్ లోని 318(4), 112,/ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3, మరియు 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008 లోని 66 (డి )సెక్షన్ల కింద కేసు నమోదైంది. విచారణ తరువాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు.

