తందూరీ రోటీలు లొట్టలేసుకుని తింటుంటాం . దక్షిణాసియా దేశాలలో కోట్లాదిమందికి ఇది రోజువారీ ప్రధాన ఆహారం. తందూరీ రోటీలు తయారుచేసే పొయ్యిలలో ఎంత వేడి ఉంటుందో తెలుసా..? తందూరీ రోటీలు తయారీకి ఉపయోగించే పొయ్యిలలో 370 డిగ్రీల; సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ పొయ్యిలలో చుట్టూ మట్టిగోడలకు తందూరీ రోటీలను అతికించివేస్తారు. ఈ పని అందరూ చేయలేరు. దానికి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం.
వాటిని అతికించాలన్న, తియ్యాలన్న నేర్పుతోనే చెయ్యాలి. పొయ్యిలో కట్టెలు లేదా బొగ్గు కాలినతరువాత ఆ మంటల్లో నుంచి వెలువడే వేడిని పొయ్యి మట్టి గోడలు తీసుకుంటాయి. ఈ మట్టిగోడలు తీసుకున్న వేడిని , వాటికి అంటించే రోటీలకు సమంగా పంపిణీచేస్తాయి. తందూరీ రోటీలు పొయ్యి గోడల కోసం టెర్రకోట లేదా బంకమన్ను వాడుతారు. ఈ పొయ్యిని గుండ్రంగా నిర్మించడం వల్ల ఉష్ణోగ్రత పొయ్యి గోడలకు సమంగా చేరుతుంది.

