22.5 C
New York
Sunday, April 5, 2026

Latest Posts

భూపరిభ్రమణలో ఈ రోజు ఒక అద్భుతం జరిగింది

విశ్వంలో నిత్యం అనేక వింతలు, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు కూడా అలాంటిదే. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం విషయంలో జూలై 9 అంటే ఈరోజు, జూలై 22 ,మరియు ఆగస్టు 5వ తేదీల్లో స్వల్పంగా తేడా రాబోతోంది. అంటే భూమి పరిభ్రమణ వేగం కొంచెం పెరుగుతుంది. బహుశా దీనిని ఒకటినుంచి ఐదు మిల్లీసెకండ్ పాటు భూమిపరిభ్రమణ వేగం లో పెరుగుదల ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది చాలా సూక్ష్మమైన అంశం అయినప్పటికీ ఉపగ్రహాల పరిభ్రమణకు ఇది చాలా ప్రధానమైనది .

ఎందుకంటే వాటి పరిభ్రమణలలో సెకండ్స్ లో లక్ష వంతు కూడా తేడాకూడా పరిగణలోకి వస్తాయి. ప్రకృతి సహజమైన కారణాలు ,వాతావరణ ధ్రువాల వద్ద మంచు కరగడం ,భూ ప్రకంపనాల తేడా, మరియు భూమి మూలా ధీన రేఖ వద్ద స్వల్పమైన మార్పు వీటన్నిటి కారణంగా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చు . అయితే భూమి పరిభ్రమణ వేగం ఇలాగే పెరుగుతుంటే దానికి నెగిటివ్ లీఫ్ సెకండ్ అవసరమవుతుంది. ఎందుకంటే అణు గడియారాలను భూ పరిభ్రమణతో సంధానం చేసేది నెగిటివ్ లీఫ్ సెకండ్. అందువల్లనే సెకండ్స్ లో మిలియన్ వంతు కూడా అణుగడియారాలలో ముఖ్యమైనదే. ఇది మనకు అనుభవంలోకి రాకపోయినప్పటికీ శాస్త్రసాంకేతిక పరంగా దీనికి ప్రాముఖ్యత ఉంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.