మీకు ఓ అద్భుతమైన విషయం తెలుసా..? గిజిగాడు అనే పక్షి సాధారణంగా గూటిని చెట్టు కొమ్మలకు తూర్పు వైపునే కడుతుంది. అదీ కాలువల నీటి పైన వేలాడే కొమ్మలకు, లేదా చిటారుకొమ్మన ఊగిసలాడే తీగలకు, లేదా సన్నటి కరెంట్ తీగలకు కడుతుంది. దీనికేదో వాస్తు శాస్త్రం తెలిసి కాదు, ఇలాంటి నిర్మాణం అతి దాని అవసరం . అది దాని ప్రాణం తనను తాను కాపాడుకునేందుకు , పొదిగే పిల్లలను రక్షించుకునేందుకు చేసే ప్రయత్నం. ఇంతకీ దీనికి కారణం ఏంటో తెలుసా ?
ఇది గూడుగట్టి గుడ్లు పెట్టి పిల్లలను పొదిగే సమయం నైరుతీ రుతుపవనాల్లో వస్తుంది. అందువల్ల నైరుతి రుతుపవనాల్లో పడమర, లేదా దక్షిణం వైపున గూడు కడితే , ఆ సీజన్లో వచ్చే గాలులు, వర్షాలకు ఆ గూడు చెదిరిపోతుందని, తూర్పువైపున గూడుకట్టి గూడుని ఈశాన్య దిక్కున లోపలికి పోయి మళ్ళీ బయటికి వచ్చేందుకు దారి పెట్టుకుంటుంది. వర్షాలు ,గాలుల నుంచి రక్షణ కోసమే గిజగాడు పక్షి ఈ పని చేస్తుంది. చూశారా..?ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని, సృష్టికర్త ఆ పక్షులకు ప్రసాదించాడో ? ఈ గూటిని మగపక్షే కడుతుంది. 20 రోజులలో కట్టగూడు కోసం దాదాపు 500 సార్లు పుల్ల, ఈనెల కోసం తిరుగుతుంది.
మొదట ఆకుల మధ్యలో ఉండే ఈనెలను వేరుచేసి కొమ్మల తీగలకు కడుతుంది. ఏడు నుంచి 20 సెంటీమీటర్ల పొడవైన ఈనెలను మొదట వేలాడదీసి, తరువాత దానిచుట్టూ గడ్డిపోచలతో గూడు కడుతుంది. పది రోజులకు పాక్షికంగా ఒకరకమైన స్థాయిలో గూడుకట్టి ఆడ పక్షిని పిలుస్తుంది . అదివచ్చి చూసి అంగీకారం తెలిపితే ,ఫైనల్ గా కూజా ఆకారంలో గూటిని పూర్తిచేస్తుంది. వేలాడే గూడు కూజా ఆకారంలో ఉండటంతో కిందనుంచి లోపలకు పోయి గూటిలో , ఆడామగ పక్షులు కలుస్తాయి. గుడ్లు పెట్టిన 17 రోజులకు పొదుగుతాయి. ఈ కాలంలో మగపక్షే ఆహరం తెచ్చిపెడుతుంది. చూసారా , గిజిగాడు పక్షి గూడు నిర్మాణం ఎంత అద్భుతమో..?

