రెక్కలు ఆడించకుండా ఎగిరే పక్షి ప్రపంచంలో ఒకటుంది. అదే అనేక రకాల విమానాల రూపకల్పనకు ఆధారమైంది. గ్లైడింగ్ కూడా ఆ పక్షిని చూసే నేర్చుకున్నాం.అదే అండియన్ రాబందు. ఈ రాబందులు 21 వేల అడుగుల ఎత్తులో ఎగరగలవు. అవి 165 కిలోమీటర్లు రెక్కలు ఆడించకుండానే ఆకాశంలో పోగలవు. కేవలం కొన్ని సెకన్లు మాత్రమే రెక్కలు ఆడిస్తుంది. ఇంతకీ వాటి రెక్కల పొడవు ఎంతో తెలుసా ? అటుఇటు కలిపి పది అడుగులు ఉంటుంది.
ఈ పక్షి నిలబడితే నాలుగు అడుగులు పొడవుంటుంది. రిఫెల్ గ్రిఫిన్ తరువాత ఎక్కువ ఎత్తులో ఎగిరే పక్షి ఇదే. రిఫెల్ గ్రిఫిన్ 37 అడుగుల ఎత్తులో ఎగురుతుంటుంది. ఇది దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాల్లో ఉంటుంది. 70 ఏళ్లపాటు బ్రతికే ఈ రాబందు, 16 వేల అడుగులపైన రాళ్ళలో గూడుకట్టి గుడ్లు పెడుతుంది. పెద్ద జంతువుల అస్తిపంజరాలమీదే మీదే ఆహరం సంపాదించుకుంటుంది. బొలివియా, చిలీ ,కొలంబియా, ఈక్వెడార్ మరియు పెరూ దేశాల అధికారిక చిహ్నం ఆండీస్ రాబందు.

