గుడ్లగూబల్లో ఓ ప్రత్యేక లక్షణం ఉంది . పక్షజాతిలో మరే పక్షిలో లేనంత వినూత్నమైన విచిత్రమైన ఒక అద్భుతమైన లక్షణామిది. అందుకే అవి పక్షులలో కల్లా అత్యంత శక్తివంతంగా వేటాడగలవు. గుడ్లగూబలోవాటి కళ్ళే కాదు, అవి వేటాడే విధానం సృష్టిలో ఒక విచిత్రం . గుడ్లగూబ ఎంత వేగంగా పోయినా అది పోతున్న శబ్దంగానీ , దాని రెక్కలు చప్పుడు గాని, అది గాలిని చీల్చుకుంటూ పోతున్నప్పుడు వచ్చే శబ్దంగానీ వినపడదు. ఎగిరే ఇతర ఏ ప్రాణికి కూడా ఇలాంటి రెక్కల అమెరికా ఉండదు. గుడ్లగూబ దూసుకుపోతున్నప్పుడు వచ్చే శబ్దాన్ని ఎవరూ వినలేదు. ఎందుకంటే అది అంత నిశ్శబ్దంగా గాలిలో దూసుకుపోగలదు. ఎగరగలదు. ఇది గుడ్లగూబకున్న ఒక అద్భుతమైన శక్తి .
దీనికి కారణం దాని రెక్కలు నిర్మాణం. ఈకలు ఒక ప్రత్యేక విధానంలో అమరివుంటాయి. అవి ఈకల చివర వంపుగా ఉండి , వెల్వెట్ లాగ మెత్తగా ఉంటాయి. అత్యంత శక్తివంతమైన మైక్రోఫోన్లు కూడా గుడ్లగూబ పోతున్న శబ్దాన్ని పసిగట్టలేవు. రికార్డ్ చేయలేవు . అంత నిశ్శబ్దంగా ఎగరగల గుడ్లగూబలకు ఈ లక్షణం సృష్టి రహస్యం. అవి ఆకాశంలో నుంచి భూమ్మీదున్న ఆహారాన్ని కూడా కిందకు దిగి పట్టుకునేంతవరకు ఆ ప్రాణికి కూడా తాను గుడ్లగూబకు ఆహారంగా అయిపోతున్నానని తెలియదు. అందుకని రాత్రి సమయాల్లో వేటాడే పక్షుల్లో గుడ్లగూబ ఈ ప్రపంచంలోనే జంతు, పక్షి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది. వేటలో నైపుణ్యం కలిగినది. గుడ్లగూబ రెక్కలు చివర భాగంలో ఈకలు దువ్వెన లాగా ఉంటాయి. గట్టిగా ఉన్నప్పటికీ చివరలో మెత్తటి వెంట్రుకలు ఉండి గాలి ప్రవాహాన్ని సులభం చేసి శబ్దాన్ని తగ్గిస్తాయి. అదీ గుడ్లగూబల వేటను శబ్దం చేయనీకుండా సులభం చేస్తుంది.

