ప్రపంచంలో అన్ని రంగాల్లో సాంకేతికత పెరిగిపోతుంది . . ఆధునిక విజ్ఞానం అప్రతినితంగా దూసుకుపోతోంది వైద్య రంగంలో కూడా అనేక దేశాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో క్లిష్టమైన రోగాలని ఆపరేషన్ లను కూడా కూడా సులభతరం చేస్తుంది. ఈ విధానంలో దూరాలను తగ్గిస్తుంది . వైద్య విజ్ఞానాన్ని పల్లెలకు చేరువ చేస్తోంది. తాజాగా చైనాలోని డాక్టర్లు ఒక అద్భుత విజయాన్ని సాధించారు. ఐదువేల కిలోమీటర్ల దూరం నుంచి ఉపగ్రహ సాయంతో లివర్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. సాటిలైట్ కమ్యూనికేషన్ రియల్ టైం విధానం తో ఆపరేషన్లో పూర్తి చేయగలిగారు.
ఈ ఆపరేషన్ ని భూమికి 36 వేలకిలోమీటర్ల ఎత్తులో ఉన్న అప్స్టార్ 6-డి ఉపగ్రహంసాయంతో 68 ఏళ్ళ వ్యక్తికి చేసారు.రోగి దగ్గర సర్జికల్ సిస్టం ఉపగ్రహానికి అనుసంధానం చేసి 5 వేల కిలోమీటర్లు నుంచి ఈ ఆపరేషన్ చేయగలిగారు. సాటిలైట్ సిగ్నల్స్ ద్వారా చేసిన ఈ ఆపరేషన్ పూర్తిస్తాయిలో విజయవంతమైందని చెప్పారు . యెంత దూరంలో ఉన్నా రియల్ టైం కంట్రోల్ విధానంలో దీన్ని చేశామని తెలిపారు . ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను మారుమూల ప్రాంతాలకు విస్తరించేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడింది.
మరియు అంతరిక్ష విజ్ఞానా న్ని , రోబోటిక్స్ పరిజ్ఞానాన్ని కలుపుకొని చేసిన ఈ ప్రయోగం విజయవంతం వైద్య రంగంలో భవిష్యత్తులో ఒక సంచలనానికి పురుడు పోసింది. ఇప్పుడు ఈ విధానంతో మారుమూల పల్లెల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా అగ్రదేశాలలోని హాస్పిటల్ కు అనుసంధానించి క్లిష్టమైన ఆపరేషన్ అక్కడనుంచే శాటిలైట్ ద్వారా చేసే రోజు మరి ఎంతో కాలంలో లేదు.. సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి రానుంది.

