22.5 C
New York
Monday, April 6, 2026

Latest Posts

ఆసియాలోనే పెద్ద బీచ్ మెరీనా.

బీచ్ లో విహారం ఆహ్లాదమే కాదు, ఆరోగ్యం కూడా . శాస్త్రీయంగా మానసిక శాస్త్ర విశ్లేషణ పరంగా కూడా అవకాశం ఉన్నవారు వారంలో రెండు దఫాలు అరగంట లేదా గంట సేపు ఏకాంతంగా బీచ్ లో గడిపితే మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది.

సముద్రం ఒడ్డున అలా ప్రశాంతంగా కూర్చుని ఉండి పోవటం అంటే ఆ ప్రశాంత వాతావరణంలో ,అలల సవ్వడిలో కొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది . ప్రాచీన కాలం నుంచి కూడా సముద్రపు ఒడ్డున ఆరోగ్యం మన కోసం వేచి ఉంటుందన్నది సామెత . అందుకే చాలామంది వేకువనే సముద్రానికి వెళ్లి సూర్య నమస్కారాలు చేసి కాసేపు ప్రశాంతంగా గడిపివస్తారు .

మనదేశంలో అతిపెద్ద బీచ్ ఎక్కడుందో మీకు తెలుసా..? తమిళనాడులో చెన్నైలోని మెరీనా బీచ్ భారతదేశంలోనే కాదు ఆసియ ఖండంలోనే అతిపెద్ద బీచ్ . ఈ బీచ్ అటు నుంచి ఇటు 13 కిలోమీటర్లు ఉంటుంది. వెడల్పు కూడా చాలా ఎక్కువే . ఇంత అందమైన బీచ్ మన దేశానికే కాదు ఆసియా దేశాల్లోనే ఒక గర్వకారణంగా చెప్పొచ్చు . అలాంటి మెరీనా బీచ్ పర్యాటకులు సందర్శకులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది.

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.