బిర్యానీ ప్రియులు లొట్టలేసుకుని తినే బిర్యాని రుచులు ఎలా ఉన్నా బిర్యానీ ఆకు మాత్రం సిరులు కురిపిస్తుంది. పశ్చిమబెంగాల్ ఉత్తర దినస్పూర్ జిల్లాలో బిర్యానీ ఆకు పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. ఒక్క బిర్యానీ ఆకు చెట్టు నుంచి ఏడాదికి 20 కిలోల బిర్యానీ ఆకులు వస్తాయి . ఇలా 25 ఏళ్ల పాటు ఇబ్బందులు లేకుండా ఒక చెట్టు ఫలితాన్ని ఇస్తుంది. ప్రస్తుతం ఉత్తర దినాస్పూర్ జిల్లాలో బిర్యానీ ఆకుపరిశ్రమ టర్నోవర్ 400 కోట్లకు దాటింది. ఈ పరిశ్రమ వల్ల సుస్థిరమైన ఆదాయాన్ని రైతులు సంపాదించుకో గలుగుతారని వ్యవసాయ పరిశోధకులు చెప్తున్నారు. ఒక బిర్యానీ ఆకు చెట్టు ఏడాదికి 15 నుంచి 20 కిలోలు బిర్యాని ఆకులు ఇస్తుంది. ఇలా 25 ఏళ్ల పాటు ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది.
బిర్యానీ ఆకుల ఆకు చెట్ల సాగు, పెంపకం, నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. 2007లో సుకుమార్ బర్మాన్ అనే ఓ రైతు ఆ జిల్లాలో బిర్యానీ ఆకుల చెట్ల పెంపకాన్ని మొదలుపెట్టాడు. అప్పటినుంచి ఈ చెట్ల పెంపకాన్ని రైతులు ఆ జిల్లాలో పెంచడం మొదలు పెట్టారు. తక్కువ శ్రమతో, తక్కువ పెట్టుబడితో, ఎక్కువ ఆదాయం సంపాదించుకునేందుకు ఇదొక మంచి మార్గం అయింది. 2017లో 25 హెక్టార్లు ఉన్న బిర్యానీ ఆకుల పెంపకం ఇప్పుడు 318 హెక్టార్లకు పెరిగింది. ప్రస్తుతానికి 2024 25 లో ప్రస్తుతం ఈ ఏడాదిలో 765 మెట్రిక్ టన్నుల బిర్యాని ఆకు ఉత్పత్తి అయింది .
ఈ బిర్యానీ ఆకు పరిశ్రమలో మహిళలు పాత్ర ఎక్కువగా ఉంటుంది. 64 శాతం మహిళలు బిర్యాని ఆకు పరిశ్రమంలోననే ప్రస్తుతం జీవనోపాధి సంపాదించుకుంటున్నారు. బిర్యానీ ఆకులను వేరు చేయడం, ఎండబెట్టడం, ప్యాకింగ్ ఇలాంటి పనులన్నీ కూడా మహిళలే చేస్తున్నారు. దీనివల్ల రోజువారి ఆదాయంలో కూడా వాళ్లకి పెరుగుదల కనిపిస్తుంది. ఇది మహిళలకు కష్టమైన పని కూడా కాదు. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో 10 వేల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ బిర్యానీ ఆకు పరిశ్రమలో ఉపాధి పొందుతున్నారు.
ఈ ఆకులు 900 నుంచి 2,500 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి వీటి పెంపకానికి విత్తనాల ద్వారానో లేదంటే అంటు కట్టే విధానంతోనో పెంచుతారు . కేరళ, కర్ణాటక, మరియు ఈశాన్య రాష్ట్రాలు, ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్లో కూడా విస్తృతంగా పెంచుతున్నారు . వంటల్లో సుగంధద్రవ్యాలుగా వినియోగానికి తోడు ఈ ఆకులతో ఆయుర్వేద మందులు తయారు చేస్తుండడంతో వీటికి గిరాకీ పెరిగింది . ఆకు నాణ్యత మరియు రంగును బట్టి కిలో 60 రూపాయలు నుంచి 400 రూపాయలు వరకు ధర పలుకుతుంది.

