విదేశాలకు పోయేవారు వీసాలు తెచ్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సవాలక్ష కష్టాలు. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన పౌరులు జపాన్ దేశ పౌరులు. జపాన్ పాస్పోర్ట్ ఉంటే చాలా దేశాల్లో పర్యటనకు వీసా కూడా అవసరం లేదు .
వీసా అవసరం లేని ప్రయాణం జపాన్ దేశ ప్రత్యేకత . ఆ దేశ ప్రత్యేకతే కాదు .జపాన్ పౌరులు ఏ దేశానికి పోవాలనుకున్న ఆ దేశంలో పర్యటించాలనుకున్నా వీసా అవసరం లేని సౌకర్యం ఉన్న ఏకైక దేశం జపాన్ ఎందుకంటే జపాన్ దేశం ఎటువంటి తీవ్రవాద నేర మరియు ఇతరత్రా ఆర్థిక నేరాలకు పాల్పడింది కాదు అందువల్లనే జపాన్ పౌరులను ప్రపంచం అత్యున్నతంగా గౌరవిస్తుంది .
పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్లో జపాన్ మొదటి స్థానంలో ఉంటుంది . జపాన్ పాస్పోర్ట్ ఉన్న పౌరులు దాదాపుగా ప్రపంచంలోనే అత్యధిక దేశాల్లో వీసా అవసరం లేకుండానే పోవచ్చు . బ్రెజిల్, యూరోపియన్ దేశాలు ,బ్రిటన్ ,ఆరబ్ దేశాలు మరియు అమెరికా ఇలా చాలా దేశాలకు జపాన్ వీసా అవసరం లేదు . ఇది జపాన్ ప్రజల ప్రత్యేకత . శాంతికాముకులైన వారి వ్యక్తిత్వానికి ప్రపంచం ఇచ్చిన పురస్కారం.

