22.5 C
New York
Saturday, April 4, 2026

Latest Posts

ప్రియుడితో కలిసి మైనర్ కూతురు ఇలా..

కలికాలంలో ఇవేమి పాడు బుద్దులు. ? హైదరాబాద్లోని జీడిమెట్లలో 16 ఏళ్ళ కూతురు తల్లిని , ప్రియుడి సాయంతో చంపేసింది. ఆ మైనర్ బాలికకు ఇంస్టాగ్రామ్ లో 19 ఏళ్ళ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరిమధ్య పెరిగిన చాటింగ్ తో ఆ బాలిక , 19 ఏళ్ళ శివ అనే యువకుడితో కలిసి ఇంటినుంచి పారిపోయింది.

తల్లి ఇచ్చిన పోలీసు ఫిర్యాదుతో ఆ బాలిక కోసం జరుగుతున్న వెదుకులాటలో మళ్ళీ ఇంటికి వచ్చేసింది. కూతురు చేసిన పనికి తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో తల్లిని చంపాలని ప్లాన్ చేసింది. ప్రియుడు, అతడి తమ్ముడుతో కలిసి తల్లి నిద్రిస్తుండగా చంపేసి పారిపోయింది. ప్రస్తుతం ఆ బాలిక పోలీసుల అదుపులో ఉంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.