పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలతో ఆరోగ్యమే కాదు ,వాతావరణం కూడా కలుషితం అయిపోతుంది. అత్యంత ప్రమాదకర రసాయనం మరియు క్యాన్సర్ కారక రసాయనాలు ఉండే ప్లాస్టిక్ చెత్తను తొలగించడం అనేది తలకి మించిన భారమైంది . నాసిరకం ప్లాస్టిక్ మరియు పాలిథిన్ నిషేధం కూడా మాటల వరకే పరిమితమైంది. అది పరిధి దాటి మానవాళిపై మహమ్మారిగా విరుచుకుపడుతోంది. అయితే తాజాగా ఆస్ట్రియా యూనివర్సిటీ చేసిన పరిశోధనలు ప్లాస్టిక్ ను జీర్ణం చేసుకొని ఎరువుగా మార్చగలిగే ఒక ఫంగస్ ను కనుగొన్నారు. దీనిపై ఇప్పుడు ప్రయోగాలు మొదలుపెట్టారు .
ఈ ఫంగస్ పగలు ,చీకట్లలో కూడా తన పని తాను చేసుకుపోతుంది . ప్లాస్టిక్ వ్యర్ధాలను ఆరగించేస్తుంది. ఆ తర్వాత దానిని ఎరువులుగా వాడుకోవచ్చని ,కొన్ని మార్పులతో ఆహారంగా కూడా ఉపయోగించవచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఫంగస్ ను పాకిస్తాన్లోని ఒక చెత్త నిలువ చేసే ప్రాంతంలో కనుక్కున్నారు . దీని పేరు ఆస్పత్రి అస్పర్ విల్లర్ టివిని జెనిసిస్ . ఇది పెరిగేందుకు వెలుగు లేదా సూర్యకాంతి అవసరం లేదు . ఇది ప్రమాదకరమైన ప్లాస్టిక్ లోని పోలీయురీతిన్ ని నిర్వీర్యం చేసి తినేస్తుంది. దాన్ని పోషక విలువలు ఉండే ఫంగల్ ప్రోటీన్ గా మారుస్తుంది .
ఇది వ్యర్ధ పదార్థాలు నివారణలోను ,భవిష్యత్తులో ఆహార కొరతను ఎదురుకోవడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతరిక్షంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు ,సబ్ మెరైన్స్ ద్వారా సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ పదార్థాలు, మరియు భూమండలం మీద ఉన్న ప్రాంతాలలో ప్లాస్టిక్ కాలుష్య మహమ్మారి నుంచి రక్షించుకోవచ్చు . ఇది ఒకటే పెరిగిపోతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించగలిగే సాధనమని భావితరాల భవిష్యత్తు కూడా ఇదే ముఖ్యమని చెప్తున్నారు.

