కూతురు పెళ్ళైన వెంటనే , అల్లుడు, కూతురుతో కలిసి తల్లితండ్రులూ ఫొటో షూట్ కి వెళ్లారు. పోయేప్పుడు కొండలు, గుట్టల్లో దొనగలుంటారని పెళ్లి నగలు ఇంట్లో పెట్టేసిపోయారు.తిరిగి వచ్చేటప్పటికి.దొంగలు పది ఇల్లు దోచేశారు. పెళ్లినాగాలు మూటకట్టుకొని హ్యాపీగా తీసుకెళ్లారు. ఈ సంఘటనలో 60తులాల బంగారం, రూ30లక్షల రూపాయలు డబ్బు పోయింది.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్ణణంలోని సాయిబాబా నగర్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. దొంగలు 60 తులాల బంగారం, రూ.30లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వెలుగోడు డివిజన్‌లోని ఎస్‌ఆర్‌బీసీ శాఖలో ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న చెల్లె శరభారెడ్డి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇటీవల తన కుమార్తె పెళ్లి కావడంతో ఫొటోషూట్ కోసం శరభారెడ్డి కుటుంబం శృతివనం వెళ్లగా ఇంట్లో ఎవరు లేరని గ్రహించిన దొంగలు బంగారం, నగదు ఎత్తుకెళ్లిన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీమ్ సాయంతో దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

