ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో చీలిక వస్తుంది.. పవన్ కళ్యాణ్ సీఎం పదవికోసం తిరుగుబాటు చేస్తాడు. ఎన్నికలనాటికి ప్రభుత్వం పతనం అవుతుంది.. చీలికవస్తే మాకే అనుకూలం .. అని వైసిపి నేతలు కలలు కంటున్నారు. అవికలలే.. ఈ ప్రభుత్వం ఐక్యంగానే ఉంటుంది. కలిసే ఉంటుంది. పిచ్చి, పిచ్చి ఆలోచనలు భ్రమలు పెట్టుకోవద్దు. మరో 15 ఏళ్ళు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.. అని పవన్ కళ్యాణ్ ఘంటాపధంగా చెప్పారు.
కూటమి ప్రభుత్వానికి ఏడాది పోరాడిన సందర్భంగా జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో పవన్ కళ్యాణ్ మాటలతో, భరోసాతో చంద్రబాబు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. సభలో ఉన్నవారంతా చప్పట్లతో మారుమోగించారు. మీ రాక్షస మళ్ళీ తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు, అది గుర్తు పెట్టుకోండి అని ఇచ్చారు. సినిమాలో డైలాగులు కొడితే , తొక్కిపెట్టి నార తీస్తా అని వైసిపి కార్యకర్తలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం వికసిత భారత్ దిశగా దేశాన్ని తీసుకుపోతుంది.
దానిలో భాగంగానే ఏపీని కూడా వికసిత్ ఆంద్ర చెయ్యాలి.. అదొక్కటే మన లక్ష్యం కావాలి అని పిలుపునిచ్చారు. కష్టాలు, ఇబ్బందులు , అడ్డంకులు , పోరాటాలు మధ్య రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాము . గతంతో పోల్చుకుంటే బాధ్యతలు పెరిగాయి. చంద్రబాబుని కూడా వదలకుండా ఇబ్బందిపెట్టారు. ఏమి మాట్లాడినా ఏమిజరుగుతుందో అని భయపడేవారు. విశాఖలో నన్ను కట్టడిచేసి ఇబ్బందిపెట్టారు. ఈ నిర్బంధాలతో, భయానక వాతావరణం నుంచి రాష్ట్రానికి విముక్తి ఎప్పుడా అని అనుకునేవాడిని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండిఉంటే ఈ రాష్ట్రం దారుణమైన పరిస్థితి ఉండేది.

