కూటికి లేని పేదలు లేదా యాచకులు లేదా అనాధలు టికెట్ లేకుండా రైళ్లలో తలుపు దగ్గర కూర్చుని ప్రయాణిస్తే దాన్ని అర్ధం చేసుకోవచ్చు. అది తప్పే అయినా కొంతమంది టీసీలు అలాంటి పేదలను చూసి చూడనట్టు వదిలేస్తారు. ఇంకొంతమంది పీడించి వాళ్ళ యాచనల ద్వారా సంపాదించుకున్న డబ్బులు ఫైన్ రూపంలో తీసేసుకుంటారు. అయితే ఇక్కడ ఓ విచిత్రం ఉంది. ఫస్ట్ క్లాస్ భోగిలో ప్రయాణించే బడా బాబులు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమో అర్థం చేసుకోవచ్చు .
ఇది వారి మానసిక స్థితిని ,నీచ బుద్ధిని చెప్పకనే చెప్తోంది. ఇదేదో ఉపోద్ఘాతానికి చెప్పేది కాదు . బాంబే రైల్వే స్టేషన్ లో ఓ మహిళా టిసి టికెట్ టికెట్ లేని ప్రయాణికుల నుంచి వసూలు చేసిన కలెక్షన్లలో చాలావరకు ఫస్ట్ క్లాస్ ట్రైన్ లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న బడా బాబులే. . రుబీనా అఖిబ్ ఇనాంధార్ అనే టీసి రైల్లో చెక్ చేసి ఒక్క రోజులోనే ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేసే 150 మంది రెగ్యులర్ ప్రయాణికుల నుంచి 45 వేల 75 రూపాయలు అపరాధ రుసుంగా వసూలు చేసింది.
వీరిలో విచిత్రం ఏమిటంటే 57 మంది ఫస్ట్ క్లాస్ ప్రయాణికులుగా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు . అందరికీ మెడలో చైన్లు ,చేతికి బ్రాస్లెట్లు ,ఖరీదైన వాచీలు ,ఖరీదైన సూట్ కేసులు ఇలా చూసేందుకు షావుకారుల మాదిరి కనిపించినా , వీళ్లు టికెట్ లేని దరిద్రులు అన్నమాట . వీళ్లను గుర్తించి కేసులు రాసి 16 వేల 430 రూపాయలు ఫైన్ గా వసూలు చేసింది. ఒక్క రోజులోనే ఆమె సాధించిన ఈ ప్రగతి అందులో బడా బాబులను ఫస్ట్ క్లాస్ ప్రయాణికులను టిక్కెట్ లేని ప్రయాణికులుగా గుర్తించి ఫైన్ వేయడం నిజంగా గమనార్హం అందుకే ఆ మహిళా టిసి రుబీనాను అందరూ అభినందిస్తున్నారు.

