ప్రపంచ జనాభా పెరిగిపోతుంది . సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది . అది కొత్త పుంతలు తొక్కుతోంది. వీటన్నిటి అవసరాలు తెచ్చేందుకు ప్రపంచంలో సహజ వనరులు క్రమంగా అంతరించిపోతున్నాయి . పెట్రోలియం ఉత్పత్తులు మరియు బొగ్గు ఇలా అనేక రకాలైన ఉత్పత్తులు మందగిస్తుండడంతో వాటి వ్యయం కూడా పెరిగిపోతుండడంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగి నానాటికి సామాన్యుడుకు భరించరాని భారమైంది. ఈ పరిస్థితుల్లో సహజ వనరులు మందగించి పోతుండటం క్షీణించిపోతుండడం ఒకరకంగా ప్రపంచానికి ఆందోళనలు కలిగించే విషయమే. పెరుగుతున్న నాగరికత, యాంత్రీకరణ , సాంకేతికత కారణంగా భూమి కూడా వేడెక్కి అనర్ధాలు సంభవిస్తున్నాయి.
వాతావరణ కాలుష్యం మానవాళిని కాటేస్తోంది. ధ్రువాల్లోని మంచు కూడా కరిగిపోతుంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో మానవాళి కి జరగనున్న ముప్పును సూచిస్తున్నాయి . కార్పవీకరణ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్తును సహజవనరుల ద్వారానే ఉత్పత్తి చేయాలన్న శాస్త్రవేత్తల నిర్ణయం మంచిదే. దానికి ఇప్పుడు ఒక శుభ సూచికం కనిపిస్తోంది . అణువిద్యుత్ ,థర్మల్ విద్యుత్తు ,హైడల్ విద్యుత్తు ఇలా ఎన్ని రకాల విద్యుత్తులు అయినా ఏదో ఒక విధంగా వాతావరణ కాలుష్యానికి కాలుష్యానికి, మానవాళి వినాశనానికి కారణమవుతోంది.
దీంతో ప్రస్తుత ప్రత్యామ్నాయం అంతరిక్షంలో సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును తయారు చేసి దాన్ని మైక్రోవేవ్ సిస్టంలో భూమ్మీదకి పంపించడం ఒక ప్రక్రియ . బ్రిటన్ లోని ఓ కంపెనీ ఈ విషయంలో నిరంతర పరిశోధనలు చేసి అద్భుత విజయాలను సాధించింది. అంతరిక్షంలో సూర్య రశ్మి లేనిసమయంలో లేదా రాత్రి సమయాల్లో ఎలా అన్న ప్రశ్నకు ఇప్పుడు అవకాశం లేదు . ఎందుకంటే అంతరిక్షంలో సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును తయారు చేయగల ఉపగ్రహం భూమండలం చుట్టూ ఎక్కడ సూర్యకాంతి ఉంటే అక్కడ తిరిగే విధంగా దాన్ని ముందుగానే ప్రోగ్రామ్ చేసి ఉంచుతారు.
అది సూర్యుడు గమనానికి అనుగుణంగానే తిరుగుతూ ఉంటుంది . అందువల్ల మేఘాలు కమ్మినా , వర్షాలు వచ్చినా ,చీకట్ల ముసురుకున్నా , సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం కలగదు . దీనిపై పరిశోధనలు ఒక కొలిక్కి వస్తున్నాయి . ఇది పూర్తయిపోతే సహజ వనరుల దోపిడీ నుంచి ,వాతావరణ కాలుష్యం నుంచి, కార్బనీకరణ నుంచి భూగోళం బయటపడుతుంది . భావితరాలు భద్రతతో కూడిన జీవితాన్ని భరోసాతో కూడిన జీవనాన్ని గడపగలవు .

