ఎద్దులంటే కొంతమందికి ప్రాణం.. పోటీలకు, బండలాగుడు పందేలకు పోయే ఎద్దులు లక్షల్లో విలువ చేస్తాయి . ఒక్కో ఎద్దుకు పౌష్టికాహారానికి రోజుకు రెండు నుంచి మూడువేల రూపాయలు వ్యయం అవుతుంది. ఈ పోటీలకు ఒక రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ తెలంగాణ నుంచి వచ్చారు. ప్రతి పోటీలకు ఆయనే ఈ ఎద్దులను స్వయంగా తీసుకొస్తారు. వీటిని ప్రత్యేక వాహనాల్లో తీసుకొస్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి పోటీలకు ఎద్దులు వస్తాయి. వీటిలో ఎక్కువగా ఒంగోలు జాతి ఎద్దులు ఉంటాయి..
నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఎద్దుల పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి జాతి ఎద్దులు వచ్చాయి. వాటిలో కొన్ని ఎద్దులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సురేంద్ర రెడ్డి అనే వ్యక్తి తీసుకొచ్చిన ఒంగోలు జాతి ఎద్దులలో ఒక దాని పేరు గాండీవ 45 లక్షలు.. మరొక దాని పేరు వీరనారసింహారెడ్డి 56 లక్షలు.. ఈ ఎద్దులు ఇప్పటివరకూ 35 ప్రదర్శనల్లో పాల్గొని బహుమతులు గెల్చుకున్నాయని వాటి యజమాని గర్వంగా చెబుతున్నారు.

