22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

ఎన్టీఆర్ వద్దు కదా ? లోకేష్ కి ఇచ్చేయండి.

తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీయార్ ని రానిస్తారా.. ? జూనియర్ ఎన్టీయార్ కి ఎంత క్రేజ్ ఉందో ? జూనియర్ ఎన్టీయార్ ని రాజకీయాల్లోకి రానివ్వనప్పుడు , ఇక ఆలస్యమెందుకు..? లోకేష్ కి వారసత్వం ఇచ్చేయండి.. లోకేష్ ని టిడిపి అధ్యక్షుణ్ణి చేసెయ్యండి.. సీఎంని కూడా చేసెయ్యండి అంటూ ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసి అన్నారు.

సుదీర్ఘకాలం సీఎంగా పనిచేశారు , ఇంకా ఎందుకు చెప్పండి. పార్టీ పగ్గాలు లోకేష్ కి ఇచ్చేయండి అంటూ సలహా ఇచ్చారు. జూనియర్ ఎన్టీయార్ ని ఎటూ రాజకీయాల్లోకి రానివ్వరు కదా ? టిడిపి నాయకత్వం ఇవ్వలేరు కదా ? అలాంటప్పుడు లోకేష్ కి ఇచ్చేయండి అంటూ సూచన చేసారు.

లోకేష్ కి నిజంగా హానిచేసేది చంద్రబాబేననని చెప్పారు. ఒవైసి జూనియర్ ఎన్టీయార్ పేరు చెబుతున్నప్పుడు చప్పట్లు మారుమోగాయి. అప్పడు ,అరె , జూనియర్ ఎన్టీయార్ కి జనంలో ఇంత క్రేజ్ ఉందా అని ఒవైసి వ్యాఖ్యానించడం విశేషం.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.