22.5 C
New York
Monday, April 6, 2026

Latest Posts

కాన్సర్ చికిత్సలో ఓ ఆశాకిరణం..

మానవాళికి మహమ్మారిగా దాపురించిన కాన్సర్ పై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. దానికంటే ముందు కాన్సర్ కారకమైన ఆహారపదార్ధాలు, కల్తీలు, వాతావరణ కాలుష్యం.. ఇలా మానవాళి ఒక భయంకర విషవలయంలో చిక్కికుపోయింది. పరిశోధనలు ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి అన్నట్టు పోతుంటే , క్యాన్సర్ కారక కల్తీ ఆహారపదార్ధాల జోరు పెరిగింది. ఇదీ నేటి పరిస్థితి. మరోవైపు కాన్సర్ వ్యాధినివారణపేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ కి పేద, మధ్య తరగతి ప్రజలు పోయే పరిస్థితి లేదు. పొతే ఆస్తులు అమ్ముకొని బ్రతకాల్సిన దుస్థితి. కాన్సర్ వైద్యం అంతంత వ్యయ ప్రయాసలతో కూడుకున్నదే అయింది. ఫలితం మాత్రం దేవుడే దిక్కు అన్నట్టుఉంది.

ఈ పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు కాన్సర్ వైద్యంలో ఒక సంచలన పరిశోధనకు శ్రీకారం చుట్టి ఆశాజనకమైన ఫలితం కళ్లముందే కనిపిస్తోందని చెబుతున్నారు క్యాన్సర్ కారక కణాలను కాంతి ద్వారానే నాశనంచేయవచ్చునని కనుగొన్నారు. మందులు, కీమోతెరిపి, రేడియేషన్ ,లాంటి క్లిష్టమైన , ఖర్చుతో కూడుకున్న విధానాలకు స్వస్తి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ పద్దతిలో రసాయనిక విధానాలతో కాకుండా క్యాన్సర్ సోకిన ప్రాంతంలో కాంతి పుంజాన్ని ప్రసరింపజేసి ఆ కణాలను నాశనం చేస్తారు.

ఈ ప్రక్రియలో మంచి కణాలకు ఎలాంటి హాని జరగదు. దీనిని ఫోటో కెమికల్ థెరపీ అని పిలుస్తున్నారు. అల్ట్రా ఫాస్ట్ లేజర్ విధానంలో చేసే ఈ చికిత్సలు అతి చిన్న , సున్నితమైన ప్రకంపనలతో లేజర్ కాంతి కాన్సర్ కణాలను విచ్చిన్నం చేస్తుంది. దీనికి ఎలాంటి ఆపరేషన్ చేసే పని ;లేదు. దీనిలో చాలా కొద్దీ మోతాదులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికి త్వరగానే కోలుకుంటారట

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.