ఒకే కుటుంబంలోని 12 మంది పిల్లలకు తల్లికి వందనం.పథకం కింద తల్లుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ.అయ్యాయి. ఒకేసారి రూ.1.56 లక్షలు తమ అకౌంట్ లో పడటంతో, ఆ కుటుంబం, ఆ తల్లుల సంతోషానికి అవధులు లేవు. చంద్రబాబు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
ఆంధ్రలో పిల్లలను బడికి పంపించే తల్లికి వందనం పధకానికి అర్హులైన తల్లులందరూ ఫుల్ హ్యాపీగా కనిపిస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి, తల్లికి వందనం పధకం కింద బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో వారంతా సంతోషంగా ఉన్నారు. తమ పిల్లల చదువుకి ఆ డబ్బుని ఉపయోగించుకుంటామని సంతోషంగా చెబుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్కరికి మాత్రమే డబ్బులు వచ్చేవని.. అయితే కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ డబ్బులు వచ్చాయని అంటున్నారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు.. మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు.

