విమానంలో పవర్ లేదు.. ఇంజిన్ థ్రస్ట్ కూడా లేదు.. నో పవర్ , నో పవర్..నో థ్రస్ట్..గోయింగ్ డౌన్.. మేడే మేడే.. ఇవీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో ప్రమాదానికి గురైన విమానం పాలెట్ చెప్పిన చివరి మాటలు.. ఎటిసిలో ఈ మాటలు రికార్డ్ అయ్యాయి. దీన్నిబట్టి ఇంజిన్ వైఫల్యం, పవర్ లేకపోవడం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
మనదేశంలో విమానాల చెకింగ్ అద్వాన్నంగా ఉంటుందని సర్వత్రా విమర్శలు ఉన్నాయి. ఒక విమానం వచ్చి నిలిస్తే దానిని మనదేశంలో అయితే కేవలం టెక్నీషియన్లే నామమాత్రంగా చెక్ చేసి పంపుతారని చెబుతారు. ఫ్లయిట్ ఇంజనీర్లు ఆ దాపులకు రాకుండా టెక్నీషన్లను పంపుతారంటారు. అదే విదేశాల్లో అయితే విమానాన్ని నాలుగుదశల్లో సీనియర్ ఇంజనీర్లు చెక్ చేస్తారు.
ప్రమాదానికి గురైన విమానం అహ్మదాబాద్ కి వచ్చినప్పుడే , విమానంలో కరెంట్ లేదని, ఏసీలు , ఇతర ఎలెక్ట్రానిక్ పరికరాలు పనిచేయలేదని ఓ ప్రయాణీకుడు ఆన్ లైన్లో వీడియో పెట్టాడు. దాని తరువాతనే విమానం బయలుదేరిందని భావిస్తున్నారు. విదేశాలకు సుదీర్ఘ ప్రయాణం చేసే ఈ విమానం చెకింగ్ లో పొరపాట్లు కారణంగానే ఇంత ఘోరం జరిగి ఉంటుందా ..? అన్న అనుమానాలు ఉన్నాయి..

