అమెరికా, ఇజ్రాయిల్ ఉన్మాదం, ఇరాన్ మొండితనం.48 గంటల్లో ఇరాన్, ఇజ్రాయిల్ ఈ రెండు దేశాల మధ్య గగనతల యుద్ధం భీకరంగా సాగుతొంది. మొదటి రోజు ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మిలిటరీ, న్యూక్లియర్ స్థావరాలపైకి 250 ఫైటర్ విమానాలు పంపింది. అత్యున్నత స్థాయి సైన్యాధ్యక్షులను ఇద్దరినీ , ఆరుగురు అణు శాస్త్రవేత్తలను, క్షిపణి దాడులలో హతమార్చింది. సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో ఇరాన్ గత రాత్రినుంచి ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది.
అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులకు మించిన విధంగా వందలాదిగా డ్రోన్ లను , యుద్ధ విమానాలను, ఖండాతర క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్ లో భారీ స్థాయిలో రక్షణ , పౌర స్థావరాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో మృతులు, గాయపడ్డ వారి సంఖ్యా ఎక్కువేనని చెబుతున్నారు. గతరాత్రి మొత్తం ఇరాన్ ఆపకుండా క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు , యాంటీ మిస్సైల్ క్షిపణులతో ఎదుర్కొంటున్నాయి. ఊహించని విధంగా ఇరాన్ విరుచుకు పడటంతో అగ్రరాజ్యం కలవరపడినట్టు ఉంది.
అనుకున్నదొకటి , అయినది ఒకటి అన్నసామెతగా పరిస్థితి తయారైంది. ఇజ్రాయెల్ లో ఇరాన్ దాడులలో 78 మంది చనిపోయారని, వందలసంఖ్యలో గాయపడ్డారని ఇరాన్ ప్రకటించింది. తమ క్షిపణి దాడులలో ఇజ్రాయిల్ మిలిటరీ అధికారులు కూడా ఉన్నారని పేర్కొంది.ఇజ్రాయిల్ ని అంతతేలికగా వదిలిపెట్టే సమస్యేలేదని , నాశనం చేసేవరకు పోరాటం ఆగదని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయిల్ కి మద్దతు ఇచ్చేవారి స్థావరాలపై కూడా దాడులు చేస్తామని చెప్పింది. దీనికి ఇజ్రాయిల్ కూడా ఘాటుగానే స్పందించింది. జరగాల్సింది చాలాఉంది. ఏమిచేయాలో చేసి చూపిస్తాం, మిమ్మల్ని దారికి తెస్తాం, లేదంటే నాశనం చేస్తాం అని ఇరాన్ ని హెచ్చరించింది.

