బైక్ ఇవ్వలేకపోతే , నీ కిడ్నీ ఇచ్చేయి.. దాన్నే కట్నంకింద లెక్కేసుకుంటాము.. నీ మొగుడు బ్రతుకుతాడు.. ఇదీ ఓ కోడలికి అత్తమామల కొత్త డిమాండు.. బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఈ ఘోరం జరిగింది. దీప్తి అనే యువతికి 2021 లో ఓ యువకుడితో పెళ్లయింది. పెళ్ళికిముందు ఆ యువకుడికి కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ అత్తమామలు దాచిపెట్టిసి పెళ్ళిచేసారు. పెళ్ళైన తరువాత తెలిసినప్పటికీ , దీప్తి సర్దుకునిపోతుంది.
ఇటీవల అదనపు కట్నం కోసం , బైక్ కోసం అత్తమామలు, భర్త వేధింపులు ఎక్కువయ్యాయట.. డబ్బులు ఇచ్చినా బైక్ కూడా కావాలని వత్తిడి చేసారు. వీలుకాదని చెప్పడంతో, అలాగైతే ఒక కిడ్నీ ఇచ్చేయమని అత్తమామలు కోడలిని హింసిసిస్తున్నారు. భర్తకూడా పోరుపెడుతున్నారని దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త రోగాన్ని దాచిపెట్టి , పెళ్ళిచేసింది కాకుండా , వైద్యానికి డబ్బులు తీసుకున్నారని చెప్పింది. ఇప్పుడు కిడ్నీ ఇచ్చి , డబ్బులు, బైక్ కూడా అడుగుతున్నారని తెలిపింది. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

