హరిహర వీరమల్లు సినిమాకు తన పారితోషకం 11 కోట్లు వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్!.. అవును. ఇది నిజం. ‘హరిహర వీరమల్లు సినిమా విడుదల మరోదఫా వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. జూన్ 12న విడుదల కావాల్సిన సినిమా వాయిదాపడింది. థియేటర్ల యాజమాన్యం సమ్మె చేస్తుందని , అని థియేటర్లను మూసేస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం తెలుగు సినిమా పరిశ్రమలో కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమాని దెబ్బతీయాలనే థియేటర్లు మూసేస్తున్నారన్న దుమారం రేగింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కొంతమంది చేతిలో గుత్తాధిపత్యం లాగ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రచారంతో ఎవరికివారు సర్దుకొని తమకు సంబంధంలేదని వివరణలు ఇచ్చుకున్నారు. అయినా నిప్పులేనిదే పొగరాదన్న సామెతలాగా దీనివెనుక ఎవరున్నారో తేల్చుకునే పనిలో పవన్ బ్యాచ్ ప్రయత్నాలు చేస్తోంది.
సినిమా జులై మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇంతవరకూ హరిహర వీరమల్లు సెన్సార్ కూడా పూర్తి కాలేదని తెలుస్తోంది.థియేటరికల్ బిజినెస్ పూర్తి కాకపోవడంతో నిర్మాత టెన్షన్‌లో ఉండటం ,నిర్మాత ఇబ్బందులు చూసి తన రెమ్యునరేషన్ దాదాపు రూ.11 కోట్లు పవన్ కళ్యాణ్ వెనక్కి ఇచ్చేశారట ..

