హానీ మూన్ కోసం పోయిన నూతన దంపతులు వారం రోజులుగాఅదృశ్యం అయ్యారు. వీరికోసం పోలీసులు, బంధువులు తీవ్రంగా మేఘాలయాలో వీరు హనీమూన్ ట్రిప్ లో తప్పిపోయారు. ఇండోర్ కి చెందిన రాజారఘువంశీ, సోనమ్ లు పెళ్లితరువాత మేఘాలయకు హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు. ఈ నెల 23 న చివరిసారిగా తల్లితండ్రులతో మాట్లాడారు. బైక్ అద్దెకు తీసుకొని కొండప్రాంతంలో రైడింగ్ కి పోతున్నామని చెప్పారు.
ఒక కొండ ప్రాంతంలో బైక్ ఆపి , ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ వెదికినా ఆచూకీలేదు. దీంతో మేఘాలయ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. టూరిజం ప్రధానంగా ఉండే ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగడంతో సంచలనం రేకెత్తింది. అందుకే మేఘాలయ అధికారులు వాళ్ళకోసం వెదుకులాట మొదలుపెట్టారు, అయితే వర్షాలు అధికంగా వస్తుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతొంది .

