ఆమె అందం ముసుగులో, డబ్బుసంపాదనకోసం దేశానికి ఇంత ప్రమాదకరంగా తయారైందా ? ఆమెతో అంత ముప్పు దాపురించిందా అన్న నిజం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఆమె తెరచాటు బాగోతాలు, దేశ ద్రోహం విషయంలో ఒక్కొక్క నిజం బయటపడుతుంటే యూట్యూబ్లో ముసుగులో ఆమె చేసిన గూడచర్యం సంచలనాత్మకంగా ఉంది .యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కాల్పులకు మూడు రోజులు ముందు ఆమె పెహల్గామ్ ఆపరిసర ప్రాంతాల్లో పర్యటించినట్టు ఆధారాలున్నాయి. దీన్నిబట్టి మారణహోమం జరిగిన ప్రాంతంలో ,అక్కడ పరిస్థితులను ఆమె తీవ్రవాదులకు చేరవేసిందన్న నిజం ఇప్పుడు తెలిసొచ్చింది. ఆమె గురించి మరో సంచలన విషయం బయటపడింది . పెహల్గామ్ లో భారతీయులను తీవ్రవాదులు కాల్చి చంపిన రోజున ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసారు. అప్పుడు కేక్ తీసుకుపోతున్న వ్యక్తితో ఆమె ఉన్న పలు వీడియోలు , పలు ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నిజం బయటపడింది.

అందం చాటున ఇంత ప్రమాదకరమైన యువతి భారత దేశంలో పాకిస్తాన్ ఏజెంట్ గా పని చేసిందంటే ఇప్పటికీ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇది కాకుండా పాకిస్తాన్లో ఆమె పర్యటన సమయంలో కరాచీలో దిగినప్పుడు ఆమెకు విఐపి స్థాయిలో సెక్యూరిటీ కల్పించారు . నలుగురు సెక్యూరిటీ గార్డులు నిరంతరం ఆమె వెంట ఉన్నారు . సాధారణ పౌరురాలుగా లేదా ఒక జర్నలిస్టుగా యూట్యూబర్ గా పాకిస్తాన్ కి పొతే పోయినప్పుడు ఇలాంటి సెక్యూరిటీ కల్పించడం అనేది అసాధ్యం. ఇంతవరకు జరగలేదు కూడా . అలాంటిది ఒక సామాన్య పౌరురాలు అయిన జ్యోతి ,మల్హోత్రాకు ఇంత భారీ స్థాయిలో సెక్యూరిటీ ఎందుకు కల్పించారు అన్నది ఇప్పుడు విశేషం.

కాకుండా ఈమె చైనా, ఇండోనేషియాలో కూడా పర్యటించినట్టు తెలుస్తోంది. ఇలా ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని ఆలయాలు వీడియోలు తీసి ఆ సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసిందో కూడా తెలియాల్సి ఉంది . కాశ్మీర్లో పలుదపాలు పర్యటించినప్పుడు అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు చేరవేసేదని కూడా చెబుతున్నారు. ఇవి కావీటన్నింటికీ మించి ఇప్పుడు సెక్యూరిటీ అధికారులు భయపెట్టే మరో అంశం ఒరిస్సా ,మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ ఇలా పలు రాష్ట్రాల్లో ఆమె స్నేహితులను అడ్డం పెట్టుకొని పలు విషయాలపై వీడియోలు తీసినట్టు తెలుస్తుంది.

ఒరిస్సాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీ జగన్నాథం ఆలయంలో వివరంగా వీడియోలు తీసి ఎక్కడ ఏమి ఉన్నాయో పరిశీలించి ఒక స్కెచ్ అందజేసినట్టు కూడా అనుమానం ఉంకుండా వాగా బార్డర్ వద్ద కూడా ఆమె పలుదపాలు వీడియోలు చేశారు .పంజాబ్ హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో సమాచారాన్ని రైల్వేస్టేషన్, ఎయిర్పోర్టులు, వాటికి దారులు అక్కడ సెక్యూరిటీలో లోటు పాట్లు ఇలాంటివన్నీ కూడా ఆమెనుంచే పోయి ఉండవచ్చునన్న అనుమానం కూడా సెక్యూరిటీ వర్గాల్లో ఉంది . ఇప్పుడు దేశ రహస్యాలు చట్టం కింద ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు .

