ఊసరవెల్లి తన శరీరపు రంగులను మారుస్తూ ఉంటుందన్న ప్రచారం నిజమా ? లేకపోతే అబద్దమా ? దీని తీరుపై అనేక సామెతలు కూడా పుట్టాయి. వేషాలు మారుస్తూ మోసం చేసే వారిని ఊసరవెల్లితో పోలుస్తారు. అలాగే వ్యక్తిత్వం లేని ఊసర వెల్లి లాంటి మనిషిని నమ్మకూడదని అంటుంటారు. ప్రకృతి ప్రతి జీవికి కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను ఇస్తుంది. జీవులు ఆ నైపుణ్యాల సాయంతో జీవితాన్ని గడుపుతాయి. ఊసరవెల్లి లోనూ అలాంటి నైపుణ్యం ఉంది. ఊసర వెల్లులు తమ రక్షణకు, ఆహారపు వేటకు, శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్దం చేసుకునేందుకు కొద్దిగా రంగును మారుస్తాయని చెబుతారు. ప్రమాద సమయంలో ఊసరవెల్లులు వాటి రంగు తో పాటు ఆకారాన్ని కూడా మార్చుకుంటాయి.
అవసరమైతే ఊసరవెల్లి దాని పరిమాణాన్ని పెంచుతుంది, అలాగే కనిపించే ఆకారాన్ని తగ్గించుకుంటుంది. అయితే ఊసరవెల్లి నిజంగానే తన శరీర రంగు మారుస్తుందా..? లేదంటే ఆ పరిసరాల రంగు దానిపై పడి అలాగే కనిపిస్తుందా..? ఇలాంటి సహజ జీవ రహస్యం దానికుందా అన్నదే ప్రశ్న . నిజానికి ఊసరవెల్లులు ఆకుపచ్చ, లేదా ఊదా రంగులోనే ఉంటాయి. ఇదీ వాటి సహజ రంగు.. అడవుల్లో, చెట్లమీద ఉన్నప్పుడు , పరిసరాల రంగుకు అనుగుణంగా తన శరీర రంగు కొద్దిగా మార్చుకుంటాయి.దీనికి వాటి శరీర ఉష్ణోగ్రతకూడా దోహదం అవుతుంది. అయితే ఇది సంపూర్ణంగా ఉండదు. కొద్దిగా అటుఇటు తేడాతో ఉంటుంది. అంతేతప్ప పూర్తిగా ఊసరవెల్లి శరీర రంగు మార్చుకోదు.. ఊసరవెల్లులు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో పోగలవు

