ప్రపంచంలో ఎక్కడైనా సరే గిరిజనులలో ముఖ్యంగా కొండ ప్రాంతాలు ,అటవీ ప్రాంతాల్లో నివసించే వారిలో ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. లిపిలేని భాష వారికి సొంతం. చరిత్రకారులకు ఇలాంటి పరిశోధనలు అంటే ఇష్టం . మేఘాలయలో కాంగ్ తాంగ్ అనే ఓ చిన్న గ్రామం ఉంది. ఇది తూర్పు కాశీ కొండల్లో, అడవుల మధ్యలో ఉంటుంది. ఈ గ్రామంలో ఓ వింత ఆచారం, సంప్రదాయం తరతరాల నుంచి వస్తుంది. ప్రతి ఇంట్లో పుట్టే పిల్లలకు తల్లి ఊళ ద్వారా ఒక పేరు పెడుతుంది. ఆ బిడ్డను పిలవాలంటే ఆ విజిల్ తోనే పిలుస్తుంది . ఎక్కడున్నా సరే ఏ బిడ్డని పిలవాలనలంటే ,ఆ బిడ్డకు ప్రత్యేకంగా ఆ రకమైన ఊళతోనే పిలుస్తుంది.
ఈ ఆచారం ప్రతి ఇంట్లోనూ కనపడుతుంది. తల్లి బిడ్డ పుట్టిన వెంటనే ఊళ వేయడం ద్వారా పేరు పెడుతుంది . ఒక లయబద్ధంగా వేసే ఊళ లోనే వాళ్ళ పేరు ఉంటుంది . అలా ఊళ వేస్తే వాళ్ళకి అది అర్థం అవుతుంది. ప్రతి ఇంట్లోనూ ఈ ఆచారం కొన్ని వందలు ఏళ్ళుగా వస్తోంది. ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క రకంగా ఊళ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే , తల్లి ఊళ ద్వారా మ్యూజిక్ కంపోజ్ చేస్తోంది. చివరకు భర్తను కూడా ఊళ వేసి పిలుస్తోంది .
ఎవరి ఇంట్లో వారే ఈ రిథమ్ ఊళను అలవర్చుకుంటుంది. జీవిత కాలం ఇదే కొనసాగుతుంది. అయితే వారికి అధికారకంగా కూడా ఒక పేరు ఉంటుంది. స్కూల్లో చేర్చిన లేదా ఇతర ఇతర ఏదైనా కార్యక్రమాల్లో ఆ పేరు వాడుకుంటారు. అయితే ఇంట్లో పిలిచేటప్పుడు, ఊర్లో పిలిచేటప్పుడు ఊళ ద్వారానే పిలుస్తారు . పదిమంది పిల్లల్లో తల్లి ఒక్కో బిడ్డకు ఒక్కో ఊళని ట్యూన్ చేస్తోంది. తమ పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగించడంలో భాగంగానే తమ బిడ్డలను ఊళతో పిలుచుకుంటామని చెప్తారు . 2023లో ఈ గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించారు. కేవలం ఈ రకమైన సాంప్రదాయం ఊళ భాష చూసేందుకు, వినేందుకే దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఆ గ్రామానికి వెళతారు .

