పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకి సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసిన మన దేశానికి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా ఓ ట్రావెల్ వి లాగ్ పేరుతొ యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది.మనదేశానికి సంబందించిన సున్నితమైన సమాచారాన్ని శత్రు దేశ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేశారన్న ఆరోపణపై ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఆమె పోస్ట్ చేసిన వీడియోలు అన్నిటిని పరిశీలించి ఈ చర్య తీసుకున్నారు . అందులో ఒక వీడియోలో పాకిస్తాన్ అధికారులతో మరియు భారత్లోని పాకిస్తాన్ హై కమిషన్ అధికారులతో ఆమె సంబంధాలను , సన్నిహిత సంబంధాలను తెలియజేసే కీలకమైన వీడియో కూడా ఉంది.

2023లో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ప్రత్యేక ఆహ్వానంపై పాకిస్తాన్లో కూడా పర్యటించి ఇఫ్తార్ విందులో కూడా పాల్గొన్నారు . దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె తన యూట్యూబ్లో షేర్ చేశారు . ఇంతటితో ఈ కథ ఆగలేదు. భారత్ లోనే భారత్ హై కమిషన్ లో ఒక అధికారితో ఆమె సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. రహస్యంగా ఆ సంబంధాలు కొనసాగిన తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ బట్టబలయ్యాయి. రెహమాన్ అలియాస్ డ్యానిష్ అనే అధికారితో ఆమె సంబంధం రుజువులతో సహా దొరికిపోయింది. దీంతో అతడిని ఈనెల 13వ తేదీ దేశం నుంచి బహిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో జ్యోతి మల్హోత్రాకు అతడికి ఉన్న సంబంధం ,అతడితో కలిసి పాకిస్తాన్ మరియు ఇండోనేషియా తదితర దేశాల్లో ఆమె గడిపిన వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి.

ఇఫ్తార్ పార్టీలకు కూడా పాకిస్తాన్ హై కమిషన్ అధికారి డానిష్ ఆమెను చాలా ప్రత్యేకంగా అతిధులు పరిచయం చేసి ఆమెను గురించి ఆకాశానికి యెత్తినట్టు మాట్లాడారు. ఈ విషయం కూడా ఆమె యూట్యూబ్లో పెట్టుకుని డ్యానిష్ వ్యాఖ్యలతో తాను మైమర్చిపోయారని చాలా ఆనందపడ్డానని కూడా తెలియజేసింది . పాకిస్తాన్ జాతీయ దినోత్సవం రోజు కూడా ఇద్దరు కలిశారు. తర్వాత ముచ్చట్లాడుకున్నారు . జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ హై కమిషన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ నుంచి పాకిస్తాన్ చూడలేని వాళ్ళు పోయి చూడండని, తాను కూడా పాకిస్తాన్ వెళ్లాను, పాకిస్తాన్లో తనకు అద్భుతమైన అనుభవాలు కలిగాయని చెప్పింది .

15 నిమిషాల పాటు ఆమె పాకిస్తాన్ ను పొగుడుతూ ఈ వీడియో చేసి పాకిస్థాన్లో భారతదేశానికి చెందిన యువతులు చాలా ఆనందంగా ఉన్నారని చెబుతూ కొన్ని వీడియోలు కూడా చేసి తన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. అధికారుల విచారణలో ఆమె చాలా దఫాలు పాకిస్తాన్ హై కమిషన్ సిబ్బందితోనూ, అధికారులతో కలిసి చర్చల్లో పాల్గొన్నదని, కార్యక్రమాల్లో తరచూ పాల్గొనేదని విదేశీ యాత్రలకు కూడా రహస్యంగా వాళ్లతో కలిసి పొయ్యేదని తేలింది. వాట్సప్ ,టెలిగ్రామ్ , చాట్ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి పాకిస్థాన్ లో పలువుతో సంబంధాలు కలిగి ఉందని తేలింది..

