అంతులేని ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికీ ,పర్యాటక రంగం మీదనే ఆధారపడ్డ దుబాయ్ ఇలాంటివెన్నో కట్టిపడేస్తాయి.. దుబాయ్ లో జాతీయఆదాయంలో 85 శాతం పర్యాటకరంగం మీదనే వస్తోంది..ఆయిల్ మీద ఒక శాతం కంటే తక్కువే ఉంటుంది. ఆయిల్ నిల్వలు ఖర్చు చేయకుండానే , ట్రేడ్, టూరిజం ద్వారానే దేశాన్ని సుసంపన్నం చేసారు. ప్రపంచంలో అతిపెద్ద రెండు ఓడరేవులు, పెద్ద కార్గో ఎయిర్ పోర్ట్ ఉన్నాయి. నైట్ క్లబ్బులు, గేమింగ్ కోర్ట్స్ లాకులు కొరత లేదు. అయితే అన్నీ పరిధులు, పరిమితులకు లోబడే ఉంటాయి.
రియల్ ఎస్టేట్ రంగం, మరియు ఆర్థిక పెట్టుబడులకు స్వర్గంగా మారి ఇప్పుడు వెలిగిపోతుంది. అదీ తెలివైన పనంటే..పాకిస్తాన్ మాదిరి నిత్యం ఉగ్రవాదం , యుద్ధోన్మాదం అంటూ నాశనం కాకుండా , తమ మతాచారాలకు అణువంత ఇబ్బందిలేకుండా , ప్రతిభావంతంగా పాలనా చేస్తూ సాగిపోతొంది. ఉగ్రవాదులు కనిపిస్తే మరణశిక్ష వేస్తారు. ప్రపంచంలో ప్రశాంతమైన నగరాల జాబితాలో దుబాయ్, షార్జా , అబుబాబి మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. దుబాయిలో ఇలాంటి వినోదాలకు కొరతలేదు..

