బీజేపీ నేత నోటి దూలకు తగిన శాస్తి జరిగింది. బిజెపి నాయకత్వం ఆగ్రహంతో కల్నల్ సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెప్పాడు. అవసరమైతే పది సార్లు క్షమాపణలు చెప్తానని , నోరుజారి మాట్లాడానని అన్నాడు. ఆపరేషన్ సిందూర్ లో అద్భుతమైన పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషీ పై దురుసు వ్యాఖ్యలు చేసి , మధ్య ప్రదేశ్ మంత్రి విజయ్ షా చీవాట్లు తిన్నాడు.
తీవ్రవాదులు పెహల్గామ్ లో , భార్యల ఎదుటే , భర్తల దుస్తులు విప్పించి కాల్చేశారని , అలాగే మోడీ కూడా తీవ్రవాదుల చెల్లెలు లాంటి కల్నల్ సోఫియా ఖురేషీ ని ఉపయోగించి , వాళ్లను చిత్తుచేసాడని అన్నారు. సైనిక దళాల్లో అత్యున్నత సేవలు అందించిన కల్నల్ సోఫియా ఖురేషీ గురించి అలా మాట్లాడటంతో దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో షా క్షమాపణలు అంటూ వేడుకున్నాడు. అతడిని మంత్రి వర్గంనుంచి తొలగించే అవకాశం కూడా ఉందంటున్నారు.

