భారత్ , పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ రాజీ ఒప్పుందం కుదిరింది. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్, విదేశాంగ కార్యదర్శి కలిసి, రెండు దేశాల అధినేతలతో చర్చలు జరిపారు. వెంటనే కాల్పుల విరమణకు అంగీకరించారని వారు తెలిపారు. ఒక తటస్థ ప్రదేశంలో కూర్చుని సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటామని అంగీకరించారని చెప్పారు. దాడులు మొదలైన తరువాత మరుసటి రోజునుంచే , పాకిస్తాన్ భయపడిపోయింది.
భారత్ ఇంత తీవ్రంగా స్పందిస్తుందని , దాడులు చేస్తుందని ఊహించలేదు. మూడు రోజుల్లో పాకిస్తాన్ కీలక స్థావరాలను ధ్వంసం చేసింది. కోలుకోలేని దెబ్బకొట్టింది. దీంతో భయపడ్డ పాకిస్తాన్ రెండో రోజునుంచే మూడో శక్తి జోక్యంకోరింది. విరమణకు తాము సిద్ధమేనని పబ్లిక్ గా ప్రకటించింది. అయినా భారత్ , దూకుడు పెంచి , శత్రుదేశానికి వణుకు పుట్టించింది. టర్కీ తప్ప ఏ ఇస్లామిక్ దేశంకూడా , పాకిస్తాన్ కి సాయంగా ముందుకు రాలేదు.. దీంతో అమెరికాను బ్రతిమాలి , రాజీ చర్చలకు ఒప్పించింది.

