22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

ఆకాశంలో క్షిపణుల యుద్ధం.పదినెలల క్రితమే జోస్యం

పది నెలల క్రితం ఓ జ్యోతిష్యుడు చెప్పింది ఇప్పుడు నిజం అయింది.. ప్రముఖ ఆంగ్లదినపత్రిక ఎకనామిక్ టైమ్స్ , ఆ నాటి ఆ జ్యోతిష్యుడి మాటలను ఎక్స్ లోనుంచి సేకరించి ప్రచురించింది. 2025 సంవత్సరంలో మే , జూన్ నెలల్లో గగనతల యుద్ధం జరుగుతుందని , ఆకాశంలో మంటలు చూస్తారని స్వామి యోగేశ్వరానంద గిరి అనే ఒక సాధువు చెప్పారు. ఆయన జ్యోతిష్యం కూడా చెబుతారు. మహాభారత కాలం మాదిరి ఒక గ్రహ కూటమి ఏర్పడుతుందన్నారు.

ఇది మహాభారత యుద్ధ కాలంలోనే కాకుండా అనేక మహా సంగ్రామమాలలో ఏర్పడిందని అన్నారు. స్వామి యోగేశ్వరానంద గిరి చెప్పిన ఈ జోస్యం అప్పట్లో కొంతమందికి రుచించకపోయినా , ఆయన చెప్పినట్టే మేనెల ఆఖరులో యుద్ధ భేరి మోగడం, ఆకాశంలో క్షిపణుల దాడులు మొదలు కావడం నిజంగా విచిత్రమే. జ్యోతిష్యం కూడా ఒక సైన్స్ అనే మాటలను నిజం చేసింది , ఈ స్వామిజీ జోస్యం..ఈ యుద్ధంతో భారత ప్రపంచంలో అజేయంగా , విజేతగా నిలిచి , శక్తివంతమైన దేశాలలో ఒకటిగా ఉంటుందన్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.