ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన అంబానీలు కుటుంబంలో ఏ వేడుక చేసినా డబ్బు చిత్తుకాగితాల్లా వాడేస్తారు. ముకేశ్ అంబానీ భార్య ఈషా అంబానీ ఇటీవల ఒక షోలో వేసుకున్న నెక్లెస్ ధర ఎంతో తెలుసా..? అక్షరాలా 12 వందల 67 కోట్ల రూపాయలు.. నిజం.. న్యూయార్క్ లో జరిగిన మెట్ గాలాలో ఆమె ఈ నెక్లెస్ తో కనిపించింది. అంతర్జాతీయ వజ్రాల తయారీ సంస్థ కార్టియర్ దీన్ని తయారుచేసింది. 1931 సంవత్సరంలో ఇలాంటి ఆభరణం నవానగర్ మహారాణి ధరించింది.
ఓషియన్ -8 అనే సినిమాలో కూడా ఇలాంటి నెక్లెస్ హీరోయిన్ వేసుకుంటుంది. అయితే ఈషా అంబానీకి ఈ నెక్లెస్ చేయించుకోవాలని మోజు పడింది. వెంటనే కొన్నిదేశాలలో తిరిగి , వజ్రాలు, కెంపులు లాంటి విలువైన జాతిరాళ్లను ఎంపికచేసుకుని , నెక్లెస్ తయారీ మొదలుపెట్టించింది.దీని తయారీకి 9 నెలలు పట్టిందని చెబుతారు. ప్రస్తుతం ప్రపంచంలో మహిళలు ధరించే అత్యంత ఖరీదైన ఆభరణం ఇదేనని చెబుతున్నారు..

