జగన్ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసును చేపట్టింది. మద్యం కుంభకోసంలో నిందితులను విచారించేందుకు అనుమతి ఇవ్వమని పోలీసుని కోరింది. పిఎంఎల్ఏ చట్టం అంటే ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నిందితులను విచారించాలని నిర్ణయించింది. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో ఎటుపోయి చివరకు ఎక్కడకు చేరాయో తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది.
కాగితాల మీదే లిక్కర్ కంపెనీలు పెట్టి బోగస్ సంస్థల ద్వారా నిధులు దారి మళ్ళీ చివరకు ఆ డబ్బులు ఎక్కడి చేరాయో తెలుసుకునేందుకు ఇప్పుడు ఈ డి రంగప్రవేశం చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు స్పష్టమవుతుంది. కేసును పక్కా ఆధారాలతో చేధిస్తూ ముందుకు పోతూ, అరెస్టులు చేస్తూ ఉన్న సిఐడి పోలీసుల దర్యాప్తులో ఇదొక సంచలమైన మలుపు .
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ కేసు విషయంలో ప్రవేశించడంతో బిగ్ బాస్ ఎవరో తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ కేసులో ముడుపులు ఎలా, ఎక్కడకు దారిమళ్లాయో తెలుసుకోవాలని విచారణ చేసేందుకు సిద్ధమైంది. లిక్కర్ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారందరూ జైల్లోఉన్నారు. ఇంకా కొంతమంది బెయిల్ కోసం ప్రయత్నం చేసి రాకపోవడంతో పరారీలో ఉన్నారు .

