పాక్ ప్రేరేపిత తీవ్రవాదంపై భారత్ యుద్ధ భేరి మోగించింది. పెహల్గామ్ లో పాక్ ఉగ్రవాదుల దారుణ మారణకాండకు ప్రతీకారం మొదలుపెట్టింది. గత రాత్రి ఒంటి గంట తర్వాత పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై క్షిపణులతో దాడి చేసింది. తీవ్రవాదులకు స్వర్గధామం లాంటి భావల్పూర్ తీవ్రవాద శిబిరాలను సర్వనాశనం చేసింది . పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తీవ్రవాద శిబిరాలతో సహా 9 ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలు గంట వ్యవధిలో ధ్వంసం అయ్యాయి. 40 నుంచి 50 మంది తీవ్రవాదులు చనిపోయినట్టు సమాచారం ఉందని కేంద్రం ప్రకటించింది. మరియు పాకిస్తాన్లోని సరిహద్దులు వెంబడి ఉన్న తీవ్రవాద శిబిరాలుపై క్షిపణులు , రాకెట్లతో విరుచుకుపడింది.

భారత్ దాడులకు సమాధానం గట్టిగానే ఉంటుందని పాకిస్తాన్ స్పందించింది . తాము చేతులు ముడుచుకుని కూర్చోలేమని చెప్పింది. అంతర్జాతీయ రేఖ , వాస్తవాదీనరేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో నలుగురు భారతీయులు చనిపోయారని ఆదేశం ప్రకటించింది. .భారత్ మాత్రం తమ భూభాగం నుంచే తాము పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు పై దాడులు చేశామని ,పౌరులకు ,పౌరనివాస ప్రాంతాలకు ఎటువంటి నష్టం జరగలేదని పేర్కొంది . అయితే పాకిస్తాన్ మాత్రం తాము అదనుచూసి ప్రతీకరం తీర్చుకుంటామని స్పష్టం చేసింది .

సరిహద్దు ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న విమానాశ్రయాన్ని కూడా మూసివేసి మిలిటరీ కార్యక్రమాలకు వాడుకోవాలని ఆదేశించింది. భారత్ దుశ్చర్యను పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర పేరుతో ఇప్పుడు యుద్ధం మొదలు కాబోతోంది. పాక్ లో ఉగ్రవాద సిబిర్రాలపై క్షిపణి దాడులకు సంబంధించి భారత్ అమెరికా ప్రభుత్వానికి వివరించింది. ఇరుదేశాల మధ్య సంయమనం అవసరమని అమెరికా హితబోధచేసింది.

