సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేవీ విశ్వాథన్ కోటీశ్వరుడు.. అంటే మామూలు కోటీశ్వరుడుకాదు.. వందకోట్లకు పైబడిన డబ్బున్న కోటీశ్వరుడు. ప్రస్తుతం ఆయనను సుప్రీం కోర్టు జడ్జిగా నియమించారు. సుప్రీం కోర్టు జడ్జికాక ముందు కేవీ విశ్వాథన్ చాలాకాలంపాటు సుప్రీం కోర్టులోనే న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ని జస్టిస్ విశ్వనాథన్ ను ఎంపిక చేసారు.
ఆయన ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు 120 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాకుండా , తనకొచ్చే ఆదాయంపై ఆయన గత పదేళ్లుగా రూ.91 కోట్ల రూపాయలు ఇన్ కం ట్యాక్స్ కట్టారు. 2010 సంవత్సరంల జస్టిస్ కేవీ విశ్వాథన్ ఆయన 30 లక్షల 69 వేల రూపాయలు ఇన్ కంట్యాక్స్ కట్టగా , 2025 నాటికి 6 కోట్ల 75 లక్షల రూపాయలు ఇన్ కంట్యాక్స్ కట్టారు. మొత్తం మీద 15 ఏళ్లలో 91 కోట్ల 47 లక్షల రూపాయలు ఇన్ కంట్యాక్స్ కట్టారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొత్తం 33 మంది న్యాయమూర్తులు ఉన్నారు. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో 21 మంది న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు పొందుపరిచారు.ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కన్నాకు బ్యాంక్ అకౌంట్లో 55 లక్షల 75 వేలరూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్స్ ఉన్నాయని వెబ్ సైట్లో పెట్టారు.

