నేటి ఓటమి ,రేపటి విజయానికి నాంది అంటూ తల్లిదండ్రులు టెన్త్ ఫెయిల్ అయిన కొడుకుకి ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసారు. కర్ణాటకలోని భాగల్ కోటకు చెందిన బసవేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి చెందిన అభిషేక్ అనే బాలుడికి 600 మార్కులు గాను 200 మార్కులు వచ్చాయి. అంటే 32 శాతం మార్కులతో ఆ బాలుడు ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు . అయితే తల్లిదండ్రులు తమ కొడుకు నిరాశనిస్పృహలతో ఏం చేసుకుంటాడో నన్న భయంతో కొడుకుకి కౌన్సిలింగ్ చేసారు. ఒక వైఫల్యం మరో విజయానికి నాంది అవుతుందని, ఆశ వదులుకోకుండా,. నిరాశ పడకుండా మళ్ళీ ప్రయత్నం చేసి పరీక్షలు రాయమని ప్రోత్సహించారు.
అంతేకాదు కేక్ కట్ చేసి సంబరాలు చేసారు. దీంతో ఆ బాలుడికి అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానన్న బాధ పోయింది. ఈ దఫా బాగా చదివి పాస్ అవుతానని ధీమావ్యక్తం చేశాడు . తల్లిదండ్రులకు కూడా హామీ ఇచ్చాడు . తమ కొడుకును బయట హేళన చేస్తే మానసికంగా కుంగిపోయి ,చేసుకుంటాడోనన్న భయంతో తల్లిదండ్రులు ఈ విధంగా చేయడం ఒకరకంగా సమర్థనీయమే.
అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే. నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయ్యావ్ కానీ జీవితంలో కాదు మళ్ళీ పరీక్షల్లో ప్రయత్నం చేసి పాస్ అవుతావు ..అని తల్లిదండ్రుల ప్రోత్సాహముతో అభిషేక్ ఆనంద పడిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ తల్లిదండ్రులు తనను నిందించకుండా ప్రోత్సహించారని ,అందువల్ల తప్పకుండా తాను పరీక్షల్లో పాస్ అవుతానని మంచి మార్కులతో తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తారని ప్రతిజ్ఞ చేశాడు.

