కాశ్మీర్ పెహల్గామ్ లో ఉగ్రవాదుల నరమేధంతో ఓ ముస్లిం యువకుడు , భార్యతో కలిసి మతం మారిపోయాడు., మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఈ సంఘటన జరిగింది. ముస్లిం మతాన్ని త్యజించి, ఓ దేవాలయంలో హిందూ మతాన్ని స్వీకరించిన ఆ యువకుడు అసలు పేరు ఆన్ మహమ్మద్. మూడేళ్ళక్రితం తాను పనిచేస్తున్న ప్రయివేట్ కంపెనీలో ఓ హిందూ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకూడా మతం మారింది.
అయితే పెహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తనను బాధపెట్టిందని , అందుకే ముస్లిం మతాన్ని వీడి , భార్యతో కలిసి , ఆలయంలో గంగా జలాన్ని నెత్తిన జల్లుకొని , సాంప్రదాయసిద్ధంగా హిందూ మతం స్వీకరించానని చెప్పారు. మానవత్వమే మతం కావాలని , హింసతో కూడా పద్దతులను అనుసరించే ఏమతమైనా మంచిది కాదన్నారు. తన పేరుని సంజూగా, భార్యపేరుని సృష్టిగా మార్చుకున్నారు.

