పాకిస్తాన్ సినిమా హీరోయిన్ హనీయా అమీర్ ప్రధానమంత్రి కి ఒక సందేశం పంపింది . ఆమె ఇంస్టాగ్రామ్ లో లేదా ఇతర సోషల్ మీడియాలో పాకిస్తానీ నటులను ఇండియాలో బ్లాక్ చేయడం అన్యాయమని ఆక్రోశించింది. అందువల్ల తమ ఫ్యాన్స్ తమను మిస్ అవుతున్నారని ,తమ సందేశాలను తెలుసుకోలేకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ సోషల్ మీడియా అకౌంట్లు ఇండియాలో బ్యాన్ చేయడంతో చాలా ఆవేదన కలుగుతుందని చెప్పింది.
ఇందుకు పాకిస్తాన్లో సెలబ్రిటీలు తెగ బాధపడిపోతున్నారని చెప్పింది. అందువల్ల ప్రధానమంత్రి మోడీ ఈ విషయంలో తమకు సహాయం చేయాలని, భారతదేశంలోని తమ అభిమానులకు తమ అభిమానాన్ని ప్రేమను పంచుకునే అవకాశం కల్పించమని కోరింది .
కళాకారులు శాంతిని ,ఐకమత్యాన్ని కోరుకుంటారని ,రాజకీయాలకు ,రాజకీయ కక్షలకు, యుద్ధాలకు , సరిహద్దులకు కళాకారులు అతీతులని , అందువల్ల రెండు దేశాల మధ్య ఉన్న పగల సెగలో తమను ఇబ్బంది పెట్టవద్దని కోరింది. భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు బ్లాక్ చేసిన తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్లను మళ్లీ భారత్ లో తమ అభిమానులు చూసేటట్టు చేయమని కోరింది.

