భర్త గడ్డంపై విసుగు చెందిన ఓ మహిళ పెళ్లయిన ఆరు నెలలకి మరిదితో లేచిపోయింది. ఆరు నెలలపాటు భర్తను గడ్డం తీయమని అడిగిన ప్పటికీ ,వినలేదని అందుకే , గడ్డం లేకుండా నీటుగా ఉన్న మరిదితో వెళ్ళిపోతున్నారని చెప్పి వెళ్లిపోయింది. ఏకంగా మరిదిని పెళ్లికూడా చేసేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఈ సంఘటన జరిగింది . భార్యాభర్తలకు పెళ్లయినప్పటి నుంచి భర్త గడ్డంపై వాదన జరుగుతూనే ఉంది. ఈ నేపద్యంలో ఆర్షి అనే మహిళ తన భర్త షాకీర్ ని వదిలేసి వెళ్లిపోయింది . మీరట్ ఉజ్వల్ గార్డెన్ కాలనీలో వీరు కాపురం ఉంటున్నారు .
షాకీర్ కథనం ప్రకారం పెళ్లి అయినప్పటి నుంచి తన భార్య గడ్డం తీయమని వేధిస్తోందని, అయితే మత సాంప్రదాయాలు ప్రకారం తన గడ్డం తీసే ప్రసక్తే లేదని చెప్పేసానని అన్నాడు. అయినా వినకుండా గడ్డం లేకుండా ఉన్న తన తమ్ముడిని బుట్టలో వేసుకొని అతడితో పారిపోయిందని చెప్పారు . అయితే పెళ్లికి ముందే గడ్డం తీస్తేనే పెళ్లి చేసుకుంటానని తన భర్తకు చెప్పానని అందుకు ఆయన ఒప్పుకున్నారని ఆమె చెబుతొంది .
పెళ్లయిన తర్వాత భర్త గడ్డం తీయకపోవడంతో తరచూ వివాదాలు జరిగేవి..మరిదితో వెళ్ళిపోయింది గాక ఇప్పుడు తన భార్య తన నుంచి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుందని భర్త షాకీర్ ఆరోపించాడు . ఈ నేపథ్యంలో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆయుష్ విక్రమ్ షాకీర్ ఫిర్యాదు పై మాట్లాడుతూ ఈ కేసు పై విచారణ జరుగుతుంది . న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

