22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

హైడ్రోజెన్ ట్రైన్ రెడీ, ఒక్కోటి 112 కోట్లు

కాలుష్య నివారణ ,పర్యావరణ పరిరక్షణ దిశగా భారతీయ రైల్వే శాఖ అడుగులు వేస్తోంది . అగ్రదేశాలతో సమానంగా ఒక విధంగా చెప్పాలంటే , మిన్నగా హైడ్రోజన్ రైళ్లు తయారీలో నిమగ్నమైవుంది. ఆలస్యమైనా అత్యుత్తమ సాంకేతికతతో , పర్యావరణాన్ని కాపాడే విధంగా హైదరాజేన్ ట్రైన్ తయారవుతొంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ హైడ్రోజన్ ట్రైన్ చెన్నైలోని ఐసిఎఫ్ లో విజయవంతంగా ప్రయోగించారు. హైడ్రోజన్ రైళ్ళకు 1200 హార్స్ పవర్ ఇంజిన్ సామర్ధ్యం ఉంది.

Image 2025 07 26t100432153 1753504429

మొదటి దశగా దేశంలో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెడతారు. ఈ ఏడాదిలోగా ఈ లక్ష్యం పూర్తిచేయాలని భావించారు. కొత్తగా ప్రవేశపెట్టే హైడ్రోజెన్ రైళ్లన్నీ కూడా కొండ ప్రాంతాలు , పర్యాటక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని తయారుచేస్తున్నారు. ఉత్తరభారతీయ రైల్వే డివిజన్ లోని జిందా నుంచి సోనిపేట మొదటి హైడ్రోజెన్ రైలు నడపాలని నిర్ణయం తీసుకున్నారు . ఈ రైలు ధర దాదాపు 112 కోట్ల రూపాయలు. ఇదికాకుండా ప్రస్తుతం వాడుకలోలేని డెమో ట్రైన్ ఇంజన్లకు హైడ్రోజెన్ బ్యాటరీలు ఫిట్ చేసి కొన్ని మార్పులతో వాటిని కూడా హైడ్రోజెన్ ట్రైన్ ఇంజిన్లగా మార్చాలని చూస్తున్నారు. ఈ పద్దతిలో ఒక్కో ట్రైన్ ధర 108 కోట్లు అవుతుంది.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.