మానవ దేహం ఒక మిస్టరీ . ఎంతకీ అర్థం కాని ఒక సృష్టి మాయ అది. సాంకేతికత ,ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినప్పటికీ ఇప్పటికీ అర్థం కాని అయోమయం మానవ దేహం. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన డాక్టర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. బహుశా ప్రపంచంలో ఇప్పటివరకు వైద్య రంగంలో జరిగిన అద్భుతాలలో ఇది కూడా ఒకటి. ఓ మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్ కు వెళ్ళింది. ఆమెను పరీక్షించిన వైద్యులలు ఆమె కడుపు నొప్పికి కారణం ఏమిటో తెలుసుకోలేకపోయారు . ఆ తర్వాత ఆమెకు స్కానింగ్ పరీక్షలు చేసి ఆమె కాలేయంలో ఓ బిడ్డ పెరుగుతున్నట్టు గుర్తించారు .
దీంతో వైద్యులు షాక్ తిన్నారు . గర్భసంచిలో పెరగాల్సిన పిండం కాలేయంలో ఎలా పెరుగుతుందని ఆశ్చర్యపోయారు. ఇది నమ్మలేని వాస్తవం. ఆ తర్వాత ఆమెను మరింత వైద్య పరీక్షలు కోసం ఉన్నత స్థాయి హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ కూడా ఆమె కాలేయంలో 12 వారాల బిడ్డ పిండం ఉన్నట్టు గుర్తించారు. అసాధారణమైన ఈ సంఘటనతో వైద్యులు ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయ వైద్య రంగంలో ప్రముఖుల సలహాలతో ఆ మహిళ కాలేయంకు ఆపరేషన్ చేసి 12 వారాల పిండాన్ని బయటకు తీశారు .
ఇలాంటి సంఘటన భారతదేశంలో జరగడం ఇదే ప్రధమమని డాక్టర్లు చెప్పారు . ప్రపంచంలో గతంలో ఒకటి రెండు సంఘటనలు మాత్రమే ఇలాంటివి జరిగాయని అన్నారు . ఇలాంటి అద్భుతాలు ఎందుకు ఎలా జరుగుతాయో తెలియదు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ సంఘటనను పరిశోధనకు స్వీకరించారు. తల్లి గర్భ సంచిలో పెరగాల్సిన బిడ్డ కాలేయంలో ఎలా పెరిగిందన్న విషయమే వైద్య పరిశోధకులను ఆలోచనలో పడేసింది. అదెలా సాధ్యమో ఇప్పుడు పరిశీలిస్తున్నారు.

